ఫౌండేషన్ అలంకరణకు తప్పనిసరి. అయితే దాన్ని ఎంచుకునే ముందర దవడ కింద భాగంలో రాసుకుని చూసుకుంటే అది చర్మం రంగులో కలిసిపోవాలి. అలాగే మేకప్ వేసుకునేందుకు ఫౌండేషన్ ముందు కొద్దిగా మాయిశ్చరైజర్ ముఖానికి రాసుకోవాలి. అప్పుడే ఇద్ది చక్కగా పరుచుకుంటుంది. కళ్ళ అడుగున మాత్రమ కన్సిలర్ బ్రష్ తో అద్దుకుంటే కళ్ళ కింద నళ్ళని వలయాలు కనబడకుండా ఉంటాయి. పౌండేషన్ కు వేళ్ళతో కాకుండ బ్రష్ తో రాసుకుంటే మంచిది. ముఖమంతా చిన్ని చిన్ని చుక్కల్లా పెట్టుకుని తర్వాత బ్రష్ తోను,స్పాంజితోనో మొహం అంతా పరుచుకునేలా రాయాలి. దీని తర్వాత అదనపు అలంకరణ అవసరం లేదు.కొద్దిగా పౌడర్ సరిపోతుంది. ఫౌండేషన్ తో పాటి ఈ వేసవికి సన్ స్క్రీన్ రాసుకోవాలి.

Leave a comment