మ్యాచింగ్ గా అన్ని వేసుకోవటం అమ్మాయిలకు అలవాటే . ఆ ఇష్టాన్నీ దృష్టిలో పెట్టుకొనే చాలా మంది నగలు ,చీరెలు, ఇంటి అలంకరణ వస్తుంటాయి . ముఖ్యంగా నగల విషయంలో ,మేడలో నెక్లెస్ ,చెవులకు పెట్టుకొనే జూకాలు ,గాజులు ఎప్పుడు మ్యాచింగ్ గానే ఉంటాయి . ఇప్పుడు కొత్తగా గాజు ఉంగరం మ్యాచింగ్ సెట్ వచ్చింది . వేసుకొనే గాజు డిజైన్ తోనే ఉంగరం కూడా ఉండటం ఫ్యాషన్ . గాజులు రాళ్ళు పొడిగినవీ ,నాలుగైదు వరసల చుట్లు రాళ్ళూ వజ్రాలు కలిపిన డిజైన్ లతో ఉండే గాజుల్లాగా ఉంగరం కూడా తయారు చేస్తున్నారు . ఈ సెట్ సాంప్రదాయ చీరెలకు చక్కగా మ్యాచ్ అవుతున్నాయి . వేడుకలు,పండగలకు ఈ సెట్ చక్కగా ఉంటుంది .

Leave a comment