రుద్రాక్ష ఆధ్యాత్మిక శక్తి కి ప్రతీకలు అంటారు అవి ధరించటం చాలా అదృష్టం గా భావిస్తారు. ఇప్పుడా రుద్రాక్షలతో ఎన్నో రకాల నగలు వచ్చాయి. బంగారు పూసలు,పెండెంట్లు కలుపుకొని ఈ రుద్రాక్ష హారాలు చాలా అందమైన రూపంలో కనిపిస్తాయి. పెళ్ళి కూతురు నగల్లో కూడా అందమైన పెండెంట్ ఉన్న సన్న రుద్రాక్షల మాల ప్రత్యేక ఆకర్షణగా ఉంది సాంప్రదాయ సందర్భాలకు పట్టు,నేత చీరెలు ధరించి,ఈ రుద్రాక్ష హారం వేసుకొంటే మొత్తం లుక్ మారిపోవటం ఖాయం. అన్ని రకాల డిజైన్ ల లోను ఈ రుద్రాక్షలను కలుపుకొని భారీ నగలు తయారు చేస్తున్నారు. ఇవి మేడలో గొలుసు,చెవులకు జూకాలు,సెట్ గా కూడా వేసుకొనేందుకు వీలుగా తయారు చేశారు డిజైనర్స్. ఇవ్వాళ రుద్రాక్ష ఫ్యాషన్  జ్యూవెలరీ లో ఒక భాగం.

Leave a comment