Categories
తల్లులు వాడే సన్ స్క్రీన్ లు ఇతర ఉత్పత్తులు పాలు తాగే పాపాయికి అపకారం చేస్తాయి అంటున్నారు ఎక్సపర్ట్స్. సన్ స్క్రీన్ లో ఆక్సి బెంజొస్ 2.2.6 శాతం వరకు ఉంటుంది. పిల్లలకు స్తన్యం ఇచ్చేప్పుడు ఇరిటేషన్ చర్మ సమస్యలకు నిప్పల్ క్రీమ్ వాడతారు ఇందులో ఉండే ఫినాక్స్ ఇధనాల్ పిల్లల్లో డయేరియా వాంతులకు కారణం అవుతుంది. అలాగే పాల కోసం వాడే బాటిళ్ళు కప్పులు ప్రాసెసడ్ ఆహారం పదార్థాల్లో బిపి.ఎ అనే రసాయనం ఉంటుంది. మామూలు గ్లాస్ లు స్టీలు సీసాలు వాడుకుంటే ఉత్తమం అంటున్నారు ఎక్సపర్ట్స్.