Categories

సంక్రాంతి నెల రోజులు ఇంటి ముందు రంగవల్లులు తీర్చి దిద్దుతారు. సాధారణంగా జీవన సమతుల్యాన్ని తెలియజెప్పే విధంగా ముగ్గుల ఆకృతులు జియోమెట్రికల్ గా ఉంటుంటాయి ప్రకృతి స్ఫూర్తి తో నెమళ్ళు,పువ్వులు,మామిడి చేపల బొమ్మలతో కనిపిస్తాయి. పవిత్రమైన కలశాలు, పొంగలి కుండలు,త్రికోణాలు,గీతల కలయికలు చుక్కల ముగ్గులు ప్రాచుర్యం పొందాయి. ఇవన్నీ దుష్టశక్తులను ఇంట్లోంకి రానివ్వకుండా అడ్డుకొంటాయని నమ్మకం.