చంద్రయాన్-3 మిషన్ లో అసోసియేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ గా ఉన్నారు కల్పన కాళహస్తి. 2000 సంవత్సరంలో ఇస్రోలో చేరారు. ముందుగా శ్రీహరి కోటలో ఐదేళ్లు పనిచేసి బెంగళూరులోని శాటిలైట్ సెంటర్ కు ట్రాన్స్ఫర్ అయ్యారు. గతంలో చంద్రయాన్-2 మంగళయాన్ ప్రాజెక్ట్ ల లోను కీలక బాధ్యతలను నెరవేర్చారు. కల్పనా తిరుపతి జిల్లా పుత్తూరు మండలంలోని తడుకు గ్రామం మద్రాస్ యూనివర్సిటీ లో బిటెక్ ఈ సి ఈ చదివారు. మిషన్ విజయవంతం కావడం నా జీవితంలో సంతోషభరితమైన జ్ఞాపకం అంటున్నారు కల్పన.

Leave a comment