Categories

హైదరాబాద్ కు చెందిన అర్పిత రాయ్ కుత్రిమ కాళ్ళతోనే యోగా శిక్షణ ఇస్తోంది. పశ్చిమ బెంగాల్ లోని బరాక్‌పూర్ కు చెందిన అర్పితా ఒక ప్రమాదంలో కాలు పోగొట్టుకుంది. ఎయిర్ హోస్టెస్ గా రాణించాలనుకునే అర్పిత జరిగిన ప్రమాదంలో ఆ ఆశ నిరాశ కాగా కనీసం తను ఫ్లెక్సిబుల్ గా ఉండాలని కోరిక తో యోగా సాధన మొదలు పెట్టింది. ఉపాధ్యాయ కోర్సులు చేశాక యోగ టీచర్ గా హైదరాబాద్ లో స్థిరపడింది ఓ కార్పొరేట్ కంపెనీలో పని చేస్తూ దివ్యాంగులకు ప్రత్యేక యోగ తరగతులు నిర్వహిస్తోంది అర్పిత.ఈమె మోటివేషనల్ స్పీకర్ కూడా.