ఒలంపిక్స్ లో భారత ప్రాతినిధ్యం వహించిన తొలి మహిళ సెయిలర్ గా చరిత్రకెక్కారు నేత్ర కుమనన్. తమిళనాడులోని చెన్నై కు చెందిన 26 ఏళ్ల నేత్ర ఎప్పుడు పారిస్ ఒలంపిక్స్ లో సెయిలింగ్ లో దేశానికి ప్రాతినిధ్యం వహిస్తుంది. 2019లో శిక్షణ మొదలుపెట్టిన నేత్ర 2014 నుంచి జాతీయ అంతర్జాతీయ పోటీల్లో రాణిస్తోంది. 2022 లో యూరోపా కప్ లో కాంస్యం సాధించింది. 2015, 2016 లో వరుసగా నేషనల్ టైటిల్స్ అందుకున్నది నేత్ర కుమనన్.ఆమెకు భరతనాట్యం, పెయింటింగ్ వంటి కళలు కరాటే,కలరిపయట్టు వంటి యుద్ధ క్రీడల్లో కూడా ప్రావీణ్యం ఉంది.

Leave a comment