ఎంతోమంది స్వాతంత్ర సమరయోధుల పోస్టల్ స్టాంప్ లు ప్రభుత్వం గౌరవంగా విడుదల చేశారు.మహిళల త్యాగం పోరాట పటిమ  ప్రతిఫలించే ఈ స్టాంప్ లు ఎంతోమందికి స్ఫూర్తి. ఉమ్మడి మద్రాస్ రాష్ట్రంలోని మధురై లో పుట్టింది రుక్మిణి సుప్రసిద్ధ ఆయుర్వేద వైద్యులు ఆచంట లక్ష్మీపతి గారి సతీమణి ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని జైలుకు వెళ్లిన తొలి మహిళల జట్టులో ఒకరు రుక్మిణమ్మ.1946 లో టంగుటూరి ప్రకాశం పంతులు గారి మంత్రివర్గంలో ఆరోగ్య మంత్రిగా పనిచేశారు. గాంధీజీ హరిజన సంక్షేమ నిధి కోసం తన నగలన్నీ విరాళం ఇచ్చి తోటి మహిళలను ప్రోత్సహించారు. ఆమె పేరిట పోస్టల్ స్టాంప్ విడుదల చేశారు.

Leave a comment