ఈ కాలం పెళ్లిళ్లకు అమ్మాయి అబ్బాయి గుణగణాలు కనిపెట్టి చెప్పే మ్యారేజ్ డిటెక్టివ్ లు ఎంతోమంది.వారిలో ముందు వరుసలో ఉంటుంది ఢిల్లీకి చెందిన భావనా పాలివాల్. ఈమెకు ఢిల్లీలో తేజప్ డిటెక్టివ్ ఏజెన్సీ ఉంది.వరుడి జీతం,వారికీ ఇతరులతో లైంగిక సంబంధాలు ఉన్నాయా వ్యక్తిగత విషయాలు అన్ని కనిపెట్టి చెప్పే వెడ్డింగ్ డిటెక్టీవ్ ఈమె పెళ్ళికి ముందు అబద్దాలు చెపితే అవి పెళ్లయ్యాక మెడకుచుట్టూకుంటాయి.వయసు,ఆస్తిపాస్తులు,చదువు,గతంలో విఫల ప్రేమలు,మొదలైనవన్నీ ముందే నిజాలు చెపితే సమస్య రావు.భావనా పాలివాల్ ఇలాటి విషయాలన్నీ కనిపెట్టి చెప్పేస్తుంది.ఇలాటి ప్రైవేట్ డిటెక్టివ్ ఏజన్సీలకు చట్టపరమైన అనుమతి ఉంది.

Leave a comment