Categories

ఉదయాన్నే కాఫీ తాగకపోతే చాలామందికి నిమిషం గడవదు. కానీ న్యూరో సైన్స్ అధ్యయనం ఈ అలవాటు తప్పంటోంది. ఉదయం పూట మన శరీరంలో కార్టిసోల్ విడుదల అవుతుంది. ఈ ఒత్తిడి కలిగించే హార్మోన్ శరీరాన్ని తర్వాతి పనులకు చురుగ్గా ఉండేలా సిద్ధం చేస్తుంది. అలాంటప్పుడు కాఫీ తాగితే కార్టిసాల్ ఉత్పత్తి రెట్టింపు అవుతుంది. ఒత్తిడి అనవసర కంగారు పుట్టుకొస్తాయి. సృజనాత్మకత పైన ప్రచారం ఎడల కాక ఆందోళన పెరుగుతుంది కనుక నిద్ర లేవగానే కాఫీ అన్న నియమాన్ని కాస్త ముందుకు పోనిచ్చి నిద్ర లేచాక కనీసం రెండు గంటల తర్వాత కాఫీ తాగండి అప్పుడు శరీరానికి కావలసిన ఉత్సాహం దొరుకుతుంది అంటున్నారు అధ్యయనకారులు.