Categories

రెండేళ్ల వయసులోనే పోలియో వచ్చిన 14 ఏళ్ల వయసులో పట్టుదలతో కృషి చేసి పారా పవర్ లిఫ్టింగ్ లో పతకాలు అందుకున్నారు పివి లతిక కేరళ కు చెందిన లతిక కేరళలోని మాత మంగళం లో పుట్టారు. ఎలాంటి వసతులు సౌకర్యాలు లేకపోయినా, మెట్ల మీద పాక్కుంటూ, పవర్ లిఫ్టింగ్ సాధన చేశారామె. 2021 లో బెంగళూరులో జరిగిన నేషనల్స్ లో పాల్గొని రెండో స్థానంలో నిలిచింది. 2022 లో 61 కిలోల కేటగిరిలో బంగారు పతకం సాధించిన తొలి కేరళ మహిళగా నిలిచారు జాతీయ పోటీల్లో కూడా తన సత్తా చూపెడతాను అంటుంది లతిక.