ఇంట్లో అందరికీ తెల్లారేసరికి, అమ్మకి తెల్లారి మూడు గంటలు దాటిపోయి ఉంటాయి. ఆమె అంత ముందరగా లేస్తేనే అందరికి సకల సదుపాయాలు. ఆమె ఒక్క రోజు అనారోగ్యంతో మంచం ఎక్కితే ఇంట్లో అందరి అవసరాలు పాడుకుంటారు. ఇవ్వాల్టికి బయట నుంచి భోజనం, ఇవ్వాళ బట్టలు వుతకక పోయినా పర్లేదు, ఇల్లు చిమ్మక పొతే ఏం పోయింది? ఇది ఇంట్లో వాళ్ళ వరస ఇలా ఇంట్లో చిన్నా పెద్దాల గురించి పట్టించు కునే ఆమె ఇంకా పిల్లల్ని కూడా కనాలి అంటే తగినన్ని పోషక విలువలువ ల తో వుంటూ ఇంకో ప్రాణికి జీవం పోయగల ఆరోగ్యంతో వుండాలి. ఇక్కడే ఇల్లు ఆ ఇంటి ఇల్లాలిని పట్టించుకోవు. ఆమె ఎలా వుంది? ఈ మధ్య కాలం లో జరిగిన ఒక అధ్యాయినం రిపోర్ట్ లు మన దేశంలో యాభై శాతం మహిళలు రక్త హీనత తో బాధ పడుతున్నారు. వాళ్ళు పిల్లల్ని కనే వయస్సులో ఉన్న వాళ్ళే. ఇది రక్త హీనత కాదు, కుటుంబం వాళ్ళ పట్ల తీసుకున్న శ్రద్ధ హీనత అంటున్నాయి అధ్యాయినాలు. రోజుకో పండయినా తినమని, కడుపు నిండా తినమని కడుపు నిండా తినమని, కాసేపు విశ్రాంతిగా, పడుకోమని ఇంట్లో ఆమెకు చేఅప్పుతున్నారా? ఆలోచిస్తే జవాబు ఎంత బాధాకరంగా వస్తుందో?

Leave a comment