పలక్ ముచ్చల్ అన్న యువతీ ఒక చిన్న పాపని ఎత్తుకుని సామజిక మాధ్యమంలో ఒక పోస్ట్ పెట్టింది . నేను కాపాడిన వెయ్యో ప్రాణం ఇది. ఈ పనికి నాకు సహకరించిన అందరికీ ధన్యవాదాలు అంటూ మేసాజ్ చేసింది. ఇండోర్లో పుట్టి పెరిగిన పలక్ శాస్త్రీయ గీతం నేర్చుకుంది. ఏడేళ్ళ వయసు నుంచి సంగీత విభావరుల్లో వేదికల్లో పాటలు పాడి సేకరించిన డబ్బులు చిన్నపిల్లల గుండె ఆపరేషన్లు చేయిస్తుంది. ఎన్నో సినిమాల్లో చక్కని పాటలు పాడింది పలక్ . ప్రతి కార్యక్రమంలో ఆమె నలభై పాటలు పాడుతుంది. తెలుగు ,కన్నడ , గుజరాతీ ఒరియా ఇలా దాదాపు పదిహేడు బాషలలో పాడగలదు . పలక్ ముచ్చల్ హార్ట్ ఫౌండేషన్ ప్రారంభించింది. బెంగుళూరు ,ఇండోర్ , ముంబై , ప్రముఖ హృద్రోగ ఆస్పత్రుల్లో వైద్యులు రాయితీ తో పిల్లలకు చికిత్సలు అందిస్తారు. ఆపరేషన్ థియేటర్ లోకి పలక్ ను రానిస్తారు. అక్కడ ఓ పక్కన నిలబడి భగవద్గీత చదువుతుంది. పలక్. తను సంపాదించిన కోట్ల రూపాయల డబ్బు పిల్లల ఆరోగ్యం కోసం ఖర్చుపెట్టిందామె. ప్రభుత్వ పురస్కారాలే కాదు. లిమ్కా, గిన్నీస్ బుక్స్ లో కూడా ఆమెకు స్థానం లభించింది. 24 ఏళ్ల వయసులో వెయ్యిమందికి ప్రాణం పోసిన పలక్ ముచ్చల్ కు శుభాకాంక్షలు.
Categories