ఒకేఒక్క చిన్న సమస్య స్నేహితులను దూరం చేస్తుంది. ఒకే ఒక చిన్న నిర్లక్ష్యం ఇమేజ్ ని దెబ్బ తీస్తుంది కూడా. ఎవళ్ళూ ఎప్పటికీ మొహమాటంతో చెప్పలేని ఇబ్బంది నోటి దుర్వాసన , దీనికి ప్రధాన కారణం నోటిలో వుండే సల్ఫియిడ్లు . ఏదన్న తిన్న వెంటనే మృదువుగా పుక్కలించగలిగితే పోయే సమస్యని అనవసరంగా పెద్దది చేసుకుంటారుకొందరు. చాలినంత హైడ్రేషన్ దీనికి పరిష్కారం. లాలాజలం నోటిలో బాక్టీరియా ని డైల్యూట్ చేస్తుంది. దాల్చిన చెక్క టీ తాగటం కూడా దీనికి పరిష్కారం. విటమిన్ సి గల పదార్ధాలు ఆరెంజ్ కమలా నిమ్మ కివిల్లాంటి సిట్రిక్ పండ్లన్నీ తాజా శ్వాసకు దోహదపడతాయి. యాపిల్ తింటే శాలివరీ ఎక్కువగా స్టిమ్యులేట్ అవుతుంది. రోజుకు రెండుసార్లు బ్రష్ చేసుకున్నంత మాత్రాన సరిపోదు. పరిశుభ్రత రొటీన్ లోటింగ్ స్క్రాపర్ అవసరం. షుగర్ ఫ్రీ గమ్ చప్పరిస్తున్నా మేలే. ఫలితంగా నోటిలో లాలాజలం పెరుగుతుంది. ఈ సమస్య కారణం దంతక్షయం. చిగుళ్ల ఇన్ఫెక్షన్ కూడా కారణం కావచ్చు. కనుక వైద్యుల చెకప్స్ నిర్లక్ష్యం చేయకూడదు.
Categories