Categories
చిన్న వయసు నుంచే అనారోగ్యాలు లేకున్నా సరే ఉప్పు వాడకం తగ్గించమంటున్నారు ముంబై వైద్యులు . ఉప్పుతో బి.పి పెరగటమే కాదు మూత్రపిండాలు దెబ్బతినే అవకాశం ఉంది . గతంలో పెద్దవాళ్ళకే ఈ సమస్య వచ్చేది . ఇప్పుడు చిన్నవాళ్ళకీ డయాలసిస్ చేయాల్సి వస్తుంది దీనికి కారణం బి.పి ఎక్కువగా ఉండటం . అది నియంత్రణలో ఉండే మూత్రపిండ సమస్యలు తగ్గుతాయి . కానీ ఈ సమస్యలన్నింటికీ మూలకారణం ఉప్పే . ఊబకాయం మధుమేహం కూడా మూత్రపిండ సమస్యలను పెంచుతాయి . ఉప్పు,పంచదార,నూనె వాడకం తగ్గిస్తేనే మంచిది .