ఐ.పి.ఎస్ ఆఫీసర్ అనుకృతి శర్మ అనుకోకుండా చేసిన పని ఆమెను వార్తల్లో నిలిచింది. ‘పోలీస్ చౌపాల్’ సమావేశంలో వృద్ధురాలు నూర్జహాన్ తాను సంవత్సరాల తరబడి కరెంట్ లేక చీకట్లో బ్రతుకుతున్నానని వయసు మీరిన తర్వాత తనకు ఇప్పుడు ఏమీ కనిపించని స్థితి వచ్చిందని తన ఇబ్బంది చెప్పుకొంది. ఆమె కోరిన నెరవేర్చేందుకు ప్రభుత్వ సాయం కోరే అవకాశం లేక అనుకృతి స్వయంగా నూర్జహాన్ ఇంటికి కరెంట్ సదుపాయం కల్పించారు. ఈ ఇంట్లో వెలిగిన బల్బ్ ని నూర్జహాన్ నవ్వు మొహాన్ని ట్విట్టర్ లో పెడితే ఎనిమిది లక్షల మంది నెటిజన్లు స్పందించారు.

Leave a comment