ఫ్యాషన్ ఇదేనంటూ చేప్పే ఒక్క నిర్వచనం ఏదీ లేదు.ఎప్పుడూ మారిపోతూ ఉండేదే ఫ్యాషన్. మరి కొన్ని నగలు కొనుక్కొంటూ ప్రతి దుస్తులపైకీ ఇదే సరిగ్గా మ్యాచ్ అవుతుందా అంటే అలగా కూదరదు. నగలనే కాదు దుస్తులకు తగ్గ యాక్ససరీస్ ఎప్పుడూ ఒకే చోట కలిసి దొరకవు. మిక్స్ అండ్ మ్యాచ్ లా వేసుకోవటం సరికొత్త ట్రెండ్. ముత్యాలతో కూడిన గొలుసులు, టెర్రికోట వంట మట్టి నగలు ,కొన్ని వెండి నగలు ,రెండు మూడు వరసల్లో పూసల గొలుసులు రెడీగా పెట్టుకొంటే ఏ క్యాజువల్ డ్రెస్ పైకి అయినా ,చీరె అయినా ఆధునికంగా కనబడే ఏ గాగ్రాలయినా అన్నింటికీ దాదాపు మ్యాచ్ అవుతాయి. వైట్ మెటల్ దేనికైనా మ్యాచింగ్ .పెద్ద లాకెట్లు పెద్దపూసల హారాలు ఇప్పుడు ట్రుండ్ కూడా.

Leave a comment