ఏదైనా లాంగ్ టూర్ వెళ్ళిన చర్మం గురించిన జాగ్రత్తలు తీసుకోవలసిందే . ఎక్కువసేపు బయట తిరగవలసి వస్తుంది.ఎండలో ఉండవలసి వస్తుంది. చర్మం తేటగా ఉండాలి అంటే ముందు మంచి మాయిశ్చరైజర్ అందుబాటులో ఉంచుకోవాలి. దానితో పాటు లిప్ బామ్స్ ,మంచి ఫేస్ క్రీం కూగా అవసరం. ప్రయాణంలో కళ్ళు అలిసి పోకుండా కళ్ళకు కట్టుకొనే రిలాక్స్ ప్యాడ్లు కూడా తెచ్చుకొంటే మంచిది. కీరా బంగాళా దుంపలు తరిగినవి ఐస్ బాక్స్ లో పడేస్తే కళ్లపైన పెట్టుకొనేందుకు పనికి వస్తాయి. ఇక ఫౌండేషన్ లు, క్రీములు లేక పోయినా పర్వాలేదు.వీటివల్ల అదనపు దుమ్ము పేరు కోవటం తప్పించి ప్రయోజనం శూన్యం.అలాగే ప్రయాణాల్లో ఎలక్ట్రిక్ ఉత్పత్తులు స్టైనర్లు ,డ్రయ్యర్లు తీసుకుపోవటం వల్లనూ ఉపయోగం ఉండదు. బ్యాగ్స్ లో వీటిని ఎక్కువ ప్లేస్ కేటాయించ వలసి వస్తుంది.ప్రయాణాల్లో ఇవి వాడితే జుల్లు పీచులా అయిపోయే ప్రమాదం ఉంది.

Leave a comment