డబుల్ ఇక్కత్  పటోలా చీరెలు గుజరాత్ సంప్రదాయ పద్దతిలో కళాకారులు అల్లుతారు . ఈ చీరె రెండు వైపులా ఒకేలా ఉంటాయి . ఈ జంట ఇక్కత్ పటోలా నేసేందుకు ఒక సంవత్సరం సమయం పడుతుంది . రెండు,మూడు నెలలు పడుగు ,పేకలకు రంగులు అద్దటం సరిపోతుంది . అంచేత ఈ చిరెల ఖరీదు లక్షలలో ఉంటుంది. వీటి తయారీ చాలా ఖచ్చితంగా ఉంటుంది . ఒకతరం నుంచి ఇంకోతరానికి వారసత్వంగా ఈ చీరె నేసే కళను అందిస్తున్నారు . ప్రాచీన వారసత్వాన్ని నవీనమైన మార్పులతో అందమైన చీరెలు తయారుచేస్తున్నారు . ఈ చీరెలు ,వీటికి వాడే రంగులు,పలుమార్లు రంగుల్లో ముంచుతూ తీసుకువచ్చే రూపం ప్రత్యేకమైన డిజైన్లు ఇక్కడి ప్రత్యేకం . ఈ అద్భుతమైన ఇక్కత్ చీరెలు ఖరీదైన ,అందంలో మాత్రం వందశాతం ఉంటాయి .

WhatsApp Image 2019-11-02 at 7.18.57 PM (1)

Leave a comment