నోట్లోని బాక్టీరియా చాలా భాగం కార్బోహైడ్రేట్స్ చక్కర లపైనా ఆధారపడుతుంది . కనుక చక్కెరతో చేసిన తీపివస్తువులు పండ్లకు అతుక్కునే వి తినటం మానేస్తేనే మంచిది . నెమ్మదిగా సిప్ చేసే తియ్యని పానీయాలు వల్ల కూడా పళ్ళకు హానే . స్టార్చ్ పదార్దాల్లో చాకెర ఎక్కువే వుంటాయి . కుకీలు ,కేకుల్లో చక్కరలు పళ్లకు అతుక్కుంటాయి . చీజ్,పాలు,సదా పెరుగు,ఆకుకూరలు బాదంపప్పులు సోంపు వంటివే పళ్ళకు మేలుచేస్తాయి . వీటిలో ఉండే కాల్షియం ఇతర పదార్దాలు వల్లే పళ్ళు బలంగా ఉంటాయి . పండ్లు కూరగాయల్లో ఎక్కువ నీరు వుంది లాలాజలం అధికంగా చేస్తాయి . ఒకసారి పళ్ళు పుచ్చిపోవటం మొదలు పెడితే వాటిని బలవంతంగా పెకలించే వరకు నొప్పి ,పన్ను సమస్య తగ్గవు కనుకనే పళ్ళ విషయంలో శ్రద్దగా ఉండండి అంటారు డాక్టర్స్ .

Leave a comment