Categories
ఇప్పుడు అవకాడో ప్రతి సూపర్ మార్కెట్ లో కుడా కనిపిస్తుంది. మాంసంలో వుండే ప్రోటీన్లు వెన్నలో వుండే ప్యాట్, ఆకు కూరల్లో వుండే విటమిన్లు, కహ్నిజాలు అవకాడో లో లభిస్తాయి. చర్మానికి ఎంత మేలు చేస్తుంది అవకడో. శరీరంపై వుండే ముడతలన్ని సహజసిద్ధంగా తొలగించడం లో అవకడో అద్భుతంగా పనిచేస్తుంది. అవకాడో గుజ్జు చిదిమి ఫేషియల్ మాస్క్ లాగా వేసినా తిన్నా వాధక్వ లక్షణాలు వేగంగా పోతాయి. అవకడో గింజల గుజ్జుతో మాడుకు మసాజ్ చెసుకుంటే చుండ్రు తగ్గిపోతుంది. అవకడో ఆయిల్ సహజమైన సన్ స్క్రీన్ లాగా పని చేస్తుంది అవకడో జ్యూస్ లో నోరు, పేగులు క్లెన్స్ అవుతాయి.