మానవ సమాజ నిర్మాణంలో అంటువ్యాధులు నిర్వహించిన పాత్ర తెలుసుకుంటే ఒకవైపు భయంగా ఉంటుంది. మరోవైపున అద్భుతంగా ఉంటుంది. పరిశుభ్రత నాగరికత మొదటి మెట్టు అని ఒప్పుకోక తప్పదు. వ్యాధులు రాజులను రాజ్యాలను కబళించాయి. మహా మహా సామ్రాజ్యాలు పతనమయ్యాయి. నూతన రాజకీయ ఆర్థిక వ్యవస్థలు ఆవిర్భవించాయి. వాటిని గురించి నాలుగు మాటలు నేను సేకరించిన వివరాలు కింద ఇచ్చాను.
1.. ఎథెనియన్ ప్లేగు -క్రీ.పూ 430-26-ఎబోలా వైరస్ హెమరేజి జ్వరం. దీనికి కారణమని చెబుతున్నారు. ఏథెన్స్ జనాభాలో 25% మంది చనిపోయారని చెబుతున్నారు.
2. .ఆంటోనిన్ ప్లేగు క్రీస్తు శకం 165-180 – చికెన్ పాక్స్ (ఆటలమ్మ) లేదా పొంగు ( మీజిల్స్) వలన వచ్చింది అనుకొన్నారు. 50 లక్షల మంది చనిపోయారు.
3..జపనీయుల మశూచి – 735 – 737 వేరియోలా వైరస్ ప్రధాన కారణం-10 లక్షల మంది చనిపోయారు.
4.. జస్టినియన్ ప్లేగు – 541- 542 యెర్సినియా పెస్టిస్ బ్యాక్టీరియా / ఎలుకలు ఈగలు కారణంగా వచ్చింది. మూడు నుంచి ఐదు కోట్ల మంది చనిపోయారు.
5..బ్లాక్ డెత్ -1334 – 37 యెర్సినా పెస్టిస్ బ్యాక్టీరియా – ఎలుకల ఈగలు కారణం – 20 కోట్ల జనాభా చనిపోయింది.
6..న్యూ వరల్డ్ మశూచి అవుట్ బ్రేక్ – 1520 నుంచి ఉంది. – వేరియోలా వైరస్ ప్రధాన కారణం – ఐదు కోట్ల అరవై లక్షల మంది చనిపోయారని అంచనా.
7. .ది గ్రేట్ ప్లేగ్ ఆఫ్ లండన్ -1665 – యెర్సినియా పెస్టిస్ బ్యాక్టీరియా ఎలుకలు /ఈగలు – కారణం ఒక లక్ష మంది చనిపోయారని అంచనా.
8. .ఇటాలియన్ ప్లేగు – 1629-1631 – యెర్సినియా పెస్టిస్ బ్యాక్టీరియా ఎలుకలు ఈగలు పది లక్షల మంది చనిపోయారు.
9. .కలరా మహమ్మారి – 1817-1923 వి. కలరా బ్యాక్టీరియా పది లక్షల మంది చనిపోయారు.
10. .మూడవ ప్లేగు – 1885 – యెర్సినియా పెస్టిస్ బ్యాక్టీరియా ఎలుకలు /ఈగలు – చైనాలో, భారత దేశంలో ఒక కోటి ఇరవై లక్షల మంది చనిపోయారని అంచనా.
11. .ఎల్లో ఫీవర్ -1800 ల చివరిలో – వైరస్ దోమలు – అమెరికాలో ఒక లక్ష నుంచి లక్షన్నర మంది చనిపోయారు.
12.. రష్యన్ ఫ్లూ – 1889 – 1890 H2N2 – ఏవిఎన్ అనే పక్షి మూలంగా భావిస్తున్నారు పది లక్షల మంది చనిపోయారు.
13.. స్పానిష్ ఫ్లూ – 1918 – 1919 హెచ్ 1ఎన్ 1 వైరస్ – పందులు కారణం – నాలుగు నుంచి ఐదు కోట్ల మంది చనిపోయారు.
14.. ఆసియా ఫ్లూ – 1957 – 58 హెచ్ 2 ఎన్ 2 వైరస్ – పదకొండు లక్షల మంది చనిపోయారని అంచనా.
15. .హాంకాంగ్ ఫ్లూ – 1968 – 70 హెచ్ 3 ఎన్ 2 వైరస్ పది లక్షల మంది చనిపోయారని అంచనా.
16. .HIV / AID లు 1981 – ప్రస్తుతం వైరస్ / చింపాంజీలు కారణమన్నారు. రెండున్నర నుంచి మూడున్నర కోట్ల మంది చనిపోయారని అంచనా.
17.. స్వైన్ ఫ్లూ 2009 – 2010 – హెచ్ 1ఎన్ 1 వైరస్ / పందులు కారణం – రెండు లక్షల మంది చనిపోయారు .
18.. సార్స్ (SARS) 2002 – 03 కరోనా వైరస్ గబ్బిలాలు నుంచి వచ్చింది. 770 మంది చనిపోయారు.
19.. ఎబోలా 2014 – 16 ఎబోలా వైరస్ అడవి జంతువులు నుంచి వచ్చింది. 11,000 మంది చనిపోయారు.
20.. మెర్స్ (MERS) 2015 – ప్రస్తుత కరోనా వైరస్ గబ్బిలాలు ఒంటెలు నుంచి అని అనుకుంటున్నారు. ఎనిమిది వందల యాభై మంది చనిపోయారు.
21. .కోవిడ్ 19- 2019 ప్రస్తుత కరోనా వైరస్ ( బహుశా పాంగోలిన్లు నుంచి వచ్చిందని భావిస్తున్నారు) 2020 జూలై 29 నాటికి ఓక కోటి పది లక్షల మంది దీనికి గురయ్యారు. ఐదు లక్షల మంది చనిపోయారు.
పరుచూరి జమున
9704111390