Categories
కాలిన గాయాలకు వంటగది లో దొరికే పదార్థాలతో చిట్కావైద్యం చేయచ్చు.అరటి ఆకు కాలిన గాయాలకు మంచి ఔషధం ఆకుల్ని మెత్తగా నూరి గాయంపైనా పై పూతలా పూస్తే గాయం త్వరగా మానిపోతుంది.స్వల్పంగా కాలిన గాయానికి చన్నీళ్ల వైద్యం చాలు కాలిన భాగాన్ని పంపు కింద ఉంచి చన్నీళ్ల ధారగా పదినిమిషాల పాటు వదిలితే చాలు గాయం కారణంగా వచ్చే నొప్పి పోతుంది. వాపు రాదు నీళ్ళలో కాస్త వెనిగర్ కలిపి కాలిన చోట పూసి శుభ్రమైన వస్త్రంతో ఆచోట కవర్ చేస్తే నొప్పి తగ్గిపోతుంది.అలాగే తేనె టీ బ్యాగ్ లు కూడా కాలిన గాయాలకు ఉపశమనం ఇస్తాయి.