చిత్తూరు జిల్లాలో శుభగిరికి సమీపంలో కాళింది మరియు నెర్రి అనే నదులకు దగ్గరగా ఈ చెంగాళమ్మ పరమేశ్వరి దర్శన భాగ్యం కలుగుతుంది.

పూర్వం ఈ ప్రాంతంలో గొడ్లు తోలుకుంటూ పిల్లలు కాళింది నదిలో దిగేసరికి నదిలో సుడులు వచ్చేటప్పటికి ఏదో ఒక శక్తి తమని పట్టుకుని రక్షించినట్టు అనిపించింది.మరుసటి రోజు మరల వెళ్ళి నదిలో దిగి చూస్తే ఒక రాయి పైన కాళికాదేవి రాక్షసుడిని సంహరిస్తున్నట్టుగా కనిపించిన పిల్లలు ఆ రాయిని ఒడ్డుకు చేర్చి పెద్దల సమక్షంలో ఒక పాక వేసి పూజలు చేశారు.
చెంగాళమ్మ ఆలయానికి తలుపులు ఉండవు. నిత్యం మనకు తోడు నీడగా అండగా చల్లగా కాపాడుతూ ఉంటుంది.

నిత్య ప్రసాదం: కొబ్బరి,మిరియాలు

-తోలేటి వెంకట శిరీష

Leave a comment