స్కూళ్ళు మొదలయ్యాయి. పిల్లలు స్కూల్లోనే భోజనం చేయాలి బాక్స్ చూడగానే ఆకర్షణియంగా ఉంటేనే పిల్లలకు ఆహారం తినాలనే కోరిక కలుగుతుంది. అందుచేత ముందు అందమైన లంచ్ బాక్స్ సెలక్ట్ చేసి ఇవ్వాలి. అలాగే ఆహారం కూడా పిల్లలకు ముందు నుంచే
అన్ని రుచులు అలవాటు చేసి సొంతంగా తినటం, మూతి శుభ్రంగా కడుక్కోవటం, తుడుచుకోవడం బాక్స్ భద్రంగా మూతపెట్టడం నేర్పాలి. తినే ఆహారాన్ని సహజమైన చక్కని రంగుల్లో అన్ని కూరగాయలు, ఆకు కూరలు ఉండేలా చూసుకుని కంటికి ఇంపుగా ప్రిపేర్ చేయాలి. తప్పనిసరిగా బాక్స్ లో ఒక పండు ఉంచాలి. జ్యూస్ రూపంలో కాక పండు తినేలా చూడాలి. పిల్లలకు ఇచ్చే స్నాక్స్ కూడా ఆయిల్ లో ముంచి తీసినవి కాకుండా డ్రై ఫ్రూట్స్,పల్లీలు, నువ్వుల లడ్డు, బెల్లంతో చేసిన సున్నుండలు, పల్లి పట్టి వంటివి ఇవ్వాలి.

Leave a comment