9 నెలల పాటు గర్భంలో మోయడం సామాన్యం కాదు కానీ , తల్లి మనస్పార్తిగా బిడ్డకోసం చేయవలసిన పనులు బోలెడు వున్నాయి. ముందుగా కండరాలు బలంగా ఉంటే వ్యాయామాలు ఎక్స్పర్ట్ పర్యవేక్షణలో చేయాలి. ప్రసవ సమయం లో బలమైన కండరాళ్ళు శిశువును తేలికగా బయటకు తీసేందుకు ఉయాయోగపడతాయి. వైద్యులను శిశువు తల ఎటువైపు ఉందో , ఏ స్ధితిలో ఉందొ తెలుసుకోవాలి. లోపలి శిశువు ను మనస్సు తో చూసేందుకు వారి పరిస్థితి అంచనా వేసేందుకు సాధ్యమౌతుంది. అలాగే 24 వరాలు నిండాక శిశువు పూర్తి స్ధాయి లో చెవులు తయారవ్వుతాయి. అప్పటి నుంచి తల్లి గొంతు గుర్తుకు పడతారు.అందుకే చక్కని పుస్తకాలు పైకి చదవడం. చక్కని సంగీతం వినడం చేస్తే శిశువుకు ఆహ్లాదం. మంచి అభిరుచులు కలుగుతాయి. తేలికైన వ్యాయామం , చక్కని భోజనం , వత్తిడి లేని వాతావరణం లో తల్లి , బిడ్డా సుఖంగా వుంటారు.

Leave a comment