Categories

బాలీవుడ్ నటి శిఖా మల్హోత్రా కోవిద్-19 బాధితులకు సేవలందించేందుకు సిద్ధం అయ్యింది. ఢిల్లీ వర్ధమాన్ మహావీర మెడికల్ కాలేజీ నుంచి శిఖా మల్హోత్రా బి ఎస్సీ నర్సింగ్ పట్టా పుచ్చుకొంది. . షారుఖ్ ఖాన్ నటించిన ఫ్యాన్ చిత్రంలో పేరు తెచ్చుకొన్న ఈ నటి కాన్ బ్లీ అనే చిత్రంలో కథా నాయికగా నటిస్తోంది. బాలాసాహెబ్ థాకరే ఆసుపత్రిలో నర్సుగా విధుల్లో చేరిందామె. ఐసొలేషన్ వార్డులో రోగులకు సేవ చేసేందుకు అవకాశం వచ్చిందనీ నా చదువుకు సార్థకత లభించిందని చెపుతోంది శిఖా మల్హోత్రా.