Categories

అడవి బిడ్డలకు మూలికా వైద్యం చేసే 75 ఏళ్ళ లక్ష్మి కుట్టి కి పద్మశ్రీ తో గౌరవించింది ప్రభుత్వం.ఆమెను వనముత్తసి ( అడవి అమ్మమ్మ ) గా పిలుస్తారు. కేరళలోని తిరువనంతపురం లోని కల్లర్ అటవీ ప్రాంతంలో నివసించే లక్ష్మీ కుట్టి గుడిసె చుట్టూ వన మూలికలుంటాయి.అడవిలో ఉండే ములికలన్నీ ఆమెకు తెలుసు.ఆమెకు 500 మూలికల పేర్లు నోటికి వచ్చు.తను నివసించే గుడిసెను ఒక వైద్యశాల గా మార్చిన ఈమె ఉచితనంగా అడవి బిడ్డలకు వైద్యం చేస్తుంది.అడవి మూలికల వివరాల్ని పుస్తకం రాసి అటవీ అధికారులకు అందజేసింది.అపురూపమైన అమ్మ .ఈమెకు ఇంతకు ముందే ఎన్నో అవార్డులు వరించాయి.