Categories
ప్రకృతి మధ్య నడిస్తే మానసిక ప్రశాంతత వస్తుందని ఆరోగ్యానికి మంచిదనే విన్నాం,కానీ ప్రకృతి ని చూస్తూ నడిస్తే మేధో శక్తి ఆధారభూతమైన ఏకాగ్రత పెరుగుతుందని చెప్తున్నారు పరిశోధకులు. 100 మంది విద్యార్థులకు మెదడు పనితీరు పరీక్షించే ఎలెక్ట్రో ఎన్సెఫాలో గ్రామ్ (ఈ ఈజీ) టోపీలను పెట్టి పరిశోధిస్తే ప్రకృతి మధ్య నడిచే వారిలో ఏకాగ్రత కు అవసరం అయ్యే ఫ్రంటల్ కార్టెక్స్ చురుగ్గా పని చేస్తోందని తేల్చారు.