Categories
పిల్లలు పుట్టాక కాస్త వ్యాయామంతో శరీరం బరువు తగ్గించుకోగలగినా ,పొట్ట కనిపిస్తూనే ఉంటుంది. అలాంటప్పుడు పెద్ద పెద్ద ప్రింట్లు భారీ ఎంబ్రయిడరీ డిజైనర్ దుస్తులు ఎంచుకొకపోవటమే మంచిది అంటారు ఫ్యాషన్ డిజైనర్స్. చిన్న చిన్న పూలు ,ఇతర ప్రింట్లు చక్కగా ఉంటాయి. అలాగే జంప్ పూట్లు ,లాంగ్ గౌన్లు కూడా బావుంటాయి. ర్యాప్ చేసిన టాప్స్ ,కఫ్తాన్ లు ట్యూనిక్ లు కూడా వేసుకోవచ్చు. జీన్స్ వేసుకోవాలంటే స్కిన్ టైట్ రకాలు కాకుండా హై వెయిస్ట్ ప్రయత్నించాలి.. ఇదే తీరు స్కర్ట్స్ లకు వర్తిస్తుంది. సాధా రంగుల్లో దుస్తులు ఎంచుకొంటే పెద్ద స్టక్స్ ,చుంకీ జ్యువెలరీ వంటివి పెట్టుకొంటే బావుంటుంది అంటారు ఎక్స్ ఫర్ట్స్.