గ్రీన్ కాఫీ వచ్చేసింది . కాఫీ గింజలు ముదిరిపోకుండా ,ఆకుపచ్చ రంగులో ఉన్నపుడే కోసి వేయించకుండా పొడి చేస్తారు . ఈ ఆకుపచ్చని కాఫీ బరువు తగ్గిస్తుంది . రోస్ట్ చేయని కాఫీ గింజల్లో క్లోరోజెనిక్ ఆమ్లాలు ఆరోగ్యానికి మంచివని .ఇవి రక్తంలో గ్లూకోజ్ నిల్వలను తగ్గించడంతో పాటు జీవక్రియలను మెరుగుపరుస్తాయని చెపుతున్నారు . మధుమేహనికి ,హృద్రోగాలకి కారణం అయ్యే ఇన్ ప్లేమేషన్ తగ్గిస్తుంది . రోజంతా చురుగ్గా ఉంచుతుందీ కాఫీ . ఇందులోని పెరులిక్ ఆమ్ల రక్తం తాజాగా ఉండేలాగా చేస్తుంది . అర్హడిక్ ,లినొలిక్ ,జాలియాక్ వంటి ఆమ్లాలు తేమని కాపాడి చెర్మాన్ని మృదువుగా చేస్తాయి . చర్మ సౌందర్యాన్ని కాపాడే ఈ కాఫీ ఇప్పుడు అందరి పేవరెట్ .

Leave a comment