Categories
ఆకులను కదిలిస్తే చాలా కమ్మని వాసన వస్తాయి. ఆకు నమిలితే నోరు సువాసనతో ఉంటుంది. ఫైబర్ ఐరన్ కాల్షియం ,విటమిన్ ఎ,బి,సి,డిలు కార్బోహైడ్రేట్స్ పుదినాలో ఉంటాయి. అనేక టూత్ పేస్టులు ,మౌత్ ప్రేషనర్స్ ముఖ్యమైన మూలపదార్ధం పుదినానే. పుదినాను నీళ్ళలో వేసి మరిగించి ఆ నీళ్ళలో ఉప్పువేసి పుక్కిలిస్తే గొంతులో ఉండే అసౌకర్యం పోతుంది. పుదినా ఆకులు తింటే గొంతులో కఫం తగ్గిపోతుంది. పుదినా ఆకుల రసం తీసి ఫ్రెష్ గా ఉన్న ఆ రసంలో పంచదార కలిపి తాగితే కడుపు నొప్పి తగ్గిపోతుంది. ఉదర సంబంధమైన ఎన్నో సమస్యలు పూదినా రసంతో పోతాయి.మరిగే నీళ్ళలో పుదినా ఆకులు వేసి ఆ నీళ్ళతో ఆవిరి పడితే జలుబు పోతుంది. ప్రకృతి ఇచ్చిన చాలా ఆకుల్లో ఔషధ గుణాలు ఉన్నాయి.