రిలాక్సింగ్ టెక్నీక్స్  చాలా బావుంటాయి. కానీ అన్నింటి లోనూ హాయి నిచ్చేది స్నానం. అలసట తగ్గి కంటినిండా నిద్ర పట్టే  స్నానాలు చాలా ఉన్నాయి. లావెండర్ నూనె వాసన చాలా బావుంటాయి. శరీరాన్ని ఉత్తేజితం చేస్తుంది. నీళ్లలో కొన్నిచుక్కల లావెండర్ నూనె అరకప్పు ఎప్పంసాల్ట్ . కప్పు వంట సోడా కలిపి స్నానం చేయాలి. ఒక వేళ టబ్  లో స్నానం చేస్తే  ఇవన్నీ కలిపి టబ్ లో పోసి ఆ నీళ్లలో సేద తీరితే ఇంకా మంచిది. ఒత్తిడీ అలసటా తగ్గిపోతుంది. ఇలాంటి స్నానాన్ని వారానికి రెండు సార్లు చేసినా చాలు. చర్మం ఆరోగ్యాంగా అయిపోతుంది. చెంచా దాల్చిన చెక్క పొడి చెంచా పసుపు కలిపిన నీళల్లో  స్నానం చేసినా అలసట దూరం అవుతుంది. చర్మం తాజాగా మెరుస్తుంది. పసుపు లోని యాంటీ సెప్టిక్ గుణాలు చర్మ సమస్యల్ని తగ్గిస్తాయి. స్నానం చేసే నీళ్లలో మూడు చెంచాల ఆలివ్ నూనె చెంచా ఎప్పమ్ సాల్ట్ కలపాలి. ఈ నూనె లో ఏ , డి , కె విటమిన్లు యాంటీ ఏజింగ్ కారకాలు చర్మాన్ని ఆరోగ్యాంగా ఉంచుతాయి. అలాగే ఆలివ్ నూనె ఎప్పమ్  సాల్ట్ లో కొద్దిగా చక్కెర  కలిపి ముఖానికి చేతులకు మర్దన చేసుకున్నా మంచి ఫలితం వుంటుంది. గ్రీన్ టీ  కూడా చర్మ ఆరోగ్యానికి మేలు. వేడి నీళ్లల్లో  గ్రీన్ టీ  బాగ్స్ వుంచి  ఆ నీళ్లలో స్నానం చేస్తే అందులోని యాంటీ ఆక్సిడెంట్స్ చర్మానికి అంది ఒత్తిడి అలసట మాయం చేస్తాయి.

Leave a comment