ఇవి చేనేత వస్త్రాలకు మంచి రోజులు.గద్వాల్ ,మంగళగిరి ,ధర్మవరం ,నారాయణపేట ,ఉప్పాడ,బందరు,మాధవరం,పోచంపల్లి ఎమ్మిగనూరు, పోలవరం పెడన ఇవన్ని నేత చీరెలకు ప్రసిద్ది చెందినవి. ఈ నేత చీరెలకు ఒక ప్రత్యేకత ఉంది. ఇవి ఎలాంటి సందార్భానికి అయినా సరిగ్గా మ్యాచ్ అవుతాయి. కాంబినేషన్ బ్లౌజ్ గురించి పెద్దగా ఆలోచించే పని లేదు. చాలా వరకు ఈ నేత చీరెల్లో నలుపు ,తెలుపు కాంబినేషన్లే ఉండాలి. పోచంపల్లి ఇకత్ లకు చీరె మొత్తం డిజైన్ కూడా ఉంటుంది. గద్వాల్, బెంగాల్ కాటన్ లకు చక్కని అంచులే అందం. ఈ చీరెలపైన నలుపు తెలుపు కలంకారీ బ్లౌజ్ లు చాలా అందంగా ఉంటాయి. చక్కని వెండినగలు ,తెల్లని బ్లౌజ్ తో చేనేత చీరెలు గ్రాండ్ లుక్ ఇస్తాయి.

Leave a comment