చల్లని జల్లులతో ప్రశాంతంగా ఉండే వాతావరణం ఇది. త్వరలో చలి రోజులు కూడా రాబోతున్నాయి.డిజైనర్లు వాతావరణానికి తగ్గట్టు కొత్త డిజైన్లు అందిస్తారు. ఈ రోజుల్లో లాంగ్ జాకెట్స్ ధరించటం కొత్త ట్రెండ్ .నెట్టర్, బెనారస్ పట్టుతో చేసే ఈ లాంగ్ జాకెట్స్ సాధారణమైన రోజుల్లోనూ ,పెళ్ళిళ్ళు, సంప్రదాయ వేడుకలకు కూడా అందం ఇస్తాయి. పట్టు లెహాంగా క్రాప్ టాప్ వేసుకొని జతగా లాంగ్ జాకెట్ ధరిస్తే వేడుకకే ప్రత్యేకమైన ఆకర్షణగా ఉండవచ్చు. కాలేజీ ఈవెంట్స్ ,స్టేజ్ షోలలో కూగా లాంగ్ వెస్ట్రన్ గౌన్ పైకి ప్లోరల్ లాంగ్ జాకెట్ ధరిస్తే ఆ వేడుకకే అందం. పట్టు లెహాంగాలు ,కాటన్ కుర్తీలు డ్రెస్ లు ,పాంట్ షర్ట్ అయినా సరే ఈ లాంగ్ జాకెట్స్ స్టైల్ గా అమరి పోతాయి.

Leave a comment