ఈ చలికాలం శరీరం గురించి శ్రద్ద తీసుకొంటేనే చర్మం పొడిబారి పోకుండా ,జుట్టు జీవం కోల్పోయి పీచులా అయిపోకుండా ఉంటుంది . చేతుల్ని ఎక్కువ సార్లు కడుగుతూ ఉంటే తేమ తగ్గిపోయి పొడిగా గరుకుగా అవుతాయి . రోజుకు రెండుసార్లు పెట్రోలియం జెల్లీ ,లేదా కొబ్బరినూనె రాసుకోవాలి . పాదాలకు గోరువెచ్చని నీళ్ళలో కాసేపు ముంచి ఉంచేసి ,తర్వాత స్క్రబ్ చేసి మాయిశ్చరైజర్ రాయాలి . రాత్రివేళ ,పెట్రోలియం జెల్లీ రాసి సాక్స్ వేసుకోవాలి . ఇలా చేస్తే కళ్ళు పగలవు . జుట్టుపడై పోకుండా తలస్నానం గోరువెచ్చని నీళ్ళ తో ముగించాలి . వారానికి రెండుసార్లు కొబ్బరినూనె ,లేదా ఆలివ్ నూనెలో తలకు మదనచేయాలి గాఢత తక్కువగా ఉన్నా పి.హెచ్ 5 నుంచి 5.5 ఉన్నా షాంపులను వాడుకోవాలి . తలస్నానం తర్వాత కండిషనర్ వాడాలి .

Leave a comment