ఫలానా అని  ఎలాంటి ట్యాగ్ తగిలించుకోకుండా   ఈమెది బంగారు పాద  ముద్ర స్థాయికి  చేరుకుంది. శృతి హాసన్. తెలుగు తమిళ   చిత్రాలతో పాటు బాలీవుడ్ లోనూ పరుగు అందుకుంటోంది. ఈ సంవత్సరం తెలుగులో  కాటమరాయుడు  మినహా మరే సినిమాకు శృతి హాసన్ డేట్లు లేవు. ఇదే చెపుతోంది శృతి హాసన్. నాకు తెలుగు సినిమా అంటే చాలా ఇష్టం. నా కెరీర్ ను మార్చింది తెలుగు పరిశ్రమే. గబ్బర్ సింగ్ కు ముందు అన్నీ పరాజయాలే. అందుకే నేనెప్పుడూ తెలుగు చిత్ర సీమకు రుణపడిఉంటానంటోంది శృతి హాసన్. ఒకప్పుడు నన్ను ఐరెన్ లెగ్ అన్నారు ఇవ్వాళ స్టార్ హీరోయిన్ అంటున్నారు. మా నాన్న దగ్గర నుండి అమ్మ దగ్గర నుండి నేను ఫీల్డ్ ను చూస్తూనే ఉన్నా. వాళ్ళ లాగే నేనూ భాషా  బేధాలతో కెరీర్ ను చూడలేదు. న దృష్టలో సినిమాకు భాష లేదు. అలా అనుకుంటే అసలు మాటలే లేని పుష్పక విమానంలో మా నాన్న ఎలా సక్సెస్ సంపాదించాడు. అంటోంది శృతి. తాను తానుగా స్టార్ గా ఎదగటం ఒక్కటే తాను ఆనందించే విషయం అంటోంది శృతి హాసన్.

 

Leave a comment