మాస్క్ తో ఆక్సిజన్ పీల్చు కొనేందుకు బదులుగా వదిలిన కార్బన్ డయాక్సైడ్ ఎక్కువగా పీల్చ వలసి వస్తోంది. ముఖ్యంగా వ్యాయామం సమయంలో ఊపిరి సరిగ్గా ఆడదని ఇబ్బంది పడే వాళ్లు, దాన్ని ఇక పట్టించుకోకండి అంటున్నారు పరిశోధకులు. మాస్క్ లు ఆక్సిజన్ బదులు కార్బన్ డయాక్సైడ్ పెంచడం వల్ల మొహానికి చెమట పట్టి వేడిగా అనిపిస్తుంది. కానీ ఇదేమి ఊపిరితిత్తుల పనితీరు పైన అంతగా ప్రభావం చూపెట్టడం లేదట. అది చిన్న ఇబ్బందే కానీ కరోనా ముప్పు తో పోలిస్తే అదేం కష్టం కాదు అంటున్నారు యునివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా పరిశోధకులు.

Leave a comment