గుండె నొప్పి జ్ఞానోత్సవాలు‌ (post 7)

Ecg

ఇంతకు ముందు పోస్ట్ మరోసారి చదవండి. అందులో ఒక ఇంపార్టెంట్ విషయం ఉంది ..ఏమంటే, గుండె జబ్బును డయాగ్నోసిస్ చేయడానికైనా లేదా ట్రీట్మెంట్ పద్ధతిని ఎన్నుకోవటానికైనా… డాక్టర్లకు ఈసీజీయే ఆధారం అని. కాబట్టి ఈసీజీ ఎంత ముఖ్యమైనదో తెలుసుకోవాలి ముందుగా.

ఈసీజీ ఎందుకు?.
————————————

మనం ఎన్నో స్టేజ్ లు దాటి వచ్చాం కాలంలో. మా గురువులు ఏం చెప్పే వారంటే ఆ కాలంలో ఈసీజీ చేయించాలని డాక్టర్లు సలహా ఇస్తే…ఈసీజీ ఎందుకు? అవసరమంటారా? అని అడిగేవారంట. ఈసీజీ చేస్తే ఏం లాభమో..పేషెంట్ కు కౌన్సిలింగ్ ఇవ్వాల్సి వచ్చేందంట. ఐదు నిమిషాల ఈసీజీ టెస్ట్ కోసం గంట సేపు కౌన్సిలింగ్ ఇచ్చిన రోజులూ ఉండేవట. ఐతే పరిస్థితి ఇప్పుడూ దాదాపు అంతే ఉంది. అప్పుడు information లేకపోవటం వలన అజ్ఞానం ఉంటే..ఇపుడు over information వలన వచ్చిన అజ్జానం. ఇపుడేమి అంటారంటే.. “Ecg అవసరం లేదు డాక్టర్, నాకు గ్యాస్ నొప్పి ఐవుంటుంది. నాకు ఇంతకు ముందు కూడా ఇలాగే వచ్చింది. డాక్టర్లు ఈసీజీ చూసి ఏమీ లేదని చెప్పేశారు. గ్యాస్ తగ్గటానికి ఓ ఇంజక్షన్ ఇవ్వగానే తగ్గిపోయింది. ఇపుడు కూడా అలాంటి ఇంజెక్షన్ ఇవ్వండి” అంటూంటారు.

“అబ్బే గుండె ప్రాబ్లం ఏం లేదు డాక్టర్..మా ఇంటావంటా లేదు. ఐనా పది రోజుల కిందటే అన్ని టెస్ట్ లు చేయించా..ఈసీజీ కూడా నార్మల్ అన్నారు” అని చెబుతూ ఉంటారు.

కాబట్టి చెప్పేదేమిటంటే….

ఈసీజీ అనేది ఆ క్షణంలో గుండె లోని ఎలక్ట్రిక్ యాక్టివిటీ ఎలా ఉందో చెబుతుంది. అంటే ఉదాహరణకు నిన్న మీరు ఈసీజీ రొటీన్ టెస్టులో భాగంగా చేయించుకున్నారనుకుందాం. కానీ ఈ రోజు ఛాతి నొప్పి వచ్చింది. ఐతే నిన్నటిది డాక్టర్ కి చూపిస్తే సరిపోదా?.

సరిపోదు. ఛాతి నొప్పి వచ్చిన ప్రతి సారీ ఈసీజీ తీయాల్సిందే. ఇంకో విషయం ఏమిటంటే heart attack వచ్చినపుడు ఈసీజీలో మార్పులు నిమిష నిమిషానికీ మారుతూ ఉంటాయి. Dynaminc ecg changes అంటారు. అందుకే ఛాతి నొప్పి పేషెంట్ కి continuous ఈసీజీ మానిటరింగ్ అవసరం.

-డాక్టర్.విరివింటి.విరించి(కార్డియాలజిస్ట్)

Leave a comment