“జయ జనార్దన కృష్ణ రాధికా పతే..
      నంద నందనా కృష్ణ  రుక్మిణీ పతే…”

ఆషాఢ మాసం వచ్చిందంటే మనకు గుర్తు వచ్చేది పూరి జగన్నాథ్ రథయాత్ర.ఈ రోజు మరి జగన్నాథుడికి మహా ప్రసాదం నైవేద్యం పెట్టి అందరినీ చల్లగా చూడాలని ప్రార్థిద్దాం!!
దేశ వ్యాప్తంగా ఉన్న వివిధ దేశాల నుండి వచ్చి రథయాత్ర లో పాల్గొన్న అనుభవం వర్ణణాతీతం.గుడి గోపురం పైన జెండా వీచే గాలికి విరుద్దంగా రెపరెప లాడుతూ ఉంటుంది.సుదర్శన చక్రం ఎటు నుంచి చూసిన మన వైపే తిరిగి వున్నట్టు కనిపిస్తుంది.
విశ్వకర్మ తన స్వహస్తాలతో శ్రీ కృష్ణ , సుభద్ర, బలరామ విగ్రహాలను వేప చెక్కతో తయారు చేసి భక్తులకు ఆనందంగా పూజలు చేయటానికి దారి చూపారు.ఈ విగ్రహాలకి కళ్ళు విశాలంగా చెక్కారు.ఇరవై ఒక్క రోజులు స్వామి జ్వరంతో బాధ పడుతున్నారని విగ్రహాలను బయటికి చూపరు.స్వామి రథయాత్ర  రోజు భక్తులు దర్శించి పునీతులవుతారు.స్వామి వారి వంటశాల అతి పెద్దదిగా గొప్ప పేరు.ఇప్పటికీ కట్టెలు పొయ్యి మీద మట్టి కుండలో ప్రసాదం తయారు చేస్తారు.

ఇష్టమైన పూలు: అన్ని రంగుల పూలు సమర్పించిన ఆనందం,  నెమలి పింఛము

ఇష్టమైన పూజలు: రథయాత్ర.

నిత్య ప్రసాదం:జగన్నాథుడికి 56 రకాల మహా ప్రసాదం నైవేద్య పెట్టి అందరినీ చల్లగా చూడాలని ప్రసాద వితరణ చేస్తారు.పొంగలి, చుడువా.
చుడువా తయారీ:అటుకులు,జీడి పప్పు,పోపు దినుసులు.
ముందుగా అటుకులు ఐదు నిమిషాలు నీళ్ళలో కడిగి గట్టిగా పిండి పక్కన పెట్టుకోవాలి. మూకుడు పెట్టి నూనె వేడి చేసి ఆవాలు,జీలకర్ర, పచ్చి మిర్చి, ఎండు మిరపకాయలు,పచ్చి శనగ పప్పు,మినప్పప్పు,కర్వేపాకు వేసి తగినంత ఉప్పు వేసి కలిపి నానబెట్టిన అటుకులు వేస్తే జీడిపప్పుతో అలంకరించి నైవేద్యం సమర్పయామి.

-తోలేటి వెంకట శిరీష

Leave a comment