డ్రెస్ కు చీరెలకే కాదు జీన్స్ ప్యాంట్ అంచుల్లో కూడా ఎంబ్రాయిడరీ మెరుపులు కనిపించేలా డిజైన్ చేయటం ఇవ్వాల్టి ట్రెండ్.జీన్స్ లో ఎన్నో రకాలు ఉన్నాయి వీటికి పట్టు టాజిల్స్ ఎంబ్రాయిడరీ రకరకాల డిజైన్లు అందంగా అంచులు కొట్టేస్తున్నారు. ట్రెండీ లుక్ కోసం టాజిల్స్ పామ్ పామ్ లు అమరుస్తున్నారు. నీలం, నలుపు తెలుపు జీన్స్ కు పట్టు అంచులు చక్కగా అమరి పోతున్నాయి. ప్యాంటుకి డబల్ బార్డర్ లుక్ కోసం పట్టు బార్డర్ తో పాటు రఫుల్స్ డిజైన్ చేస్తున్నారు. ఎంబ్రాయిడరీ వర్క్ డిజైన్ బట్టి ప్యాంటు ను ప్రత్యేక సందర్భాలలో ధరిస్తున్నారు. రకరకాల రంగు రాళ్లు కుందన్ లు పొదిగిన ఫాంట్లు చక్కని లుక్ తో  ట్రెండీగా ఉన్నాయి.

Leave a comment