Categories
అందమైన షోకేసుల్లో అలంకరించేందుకు అందమైన బొమ్మలు కావాలనుకొంటే వెడ్డింగ్ డాల్స్ వైపు చూడవచ్చు . ఇండియా ఎతిక్స్ ,ఎక్స్ ప్రెసివ్ డాల్జ్ వంటి సంస్థలు పెళ్ళి బొమ్మల్ని తయారు చేస్తున్నాయి . వధువరులు,పెండ్లి పీటల పైన కూర్చున్న సెట్ తాళి కట్టటం ,తలంబ్రాలు ,బంధువుల భోజనాలు ఇవన్నీ బొమ్మల రూపంలో తయారుచేస్తున్నారు . వీటిని కాగితపు గుజ్జుతో తయారు చేస్తారు . వాటికీ సాంప్రదాయ బద్దంగా బట్టలు ,నగలు,తయారుచేసి కడితే ఎంతో ఆకర్షణీయంగా ఉంటున్నాయి . ఈ వెడ్డింగ్ డాల్స్ విదేశీ మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంది . ఈ పెళ్ళి బొమ్మలు వివిధ ప్రాంతాల ఆచారాలకు తగ్గట్టు తయారు చేస్తారు . కట్టు ,బొట్టు తీరులో కూడా ఎంతో తేడా తీసుకువస్తున్నారు .