Categories
కరేబియన్ సముద్రం లో అందమైన ద్వీపం అరుబా ఇక్కడ విహరించే గులాబీ రంగు ఫ్లెమింగో ల వల్లనే ఈ ద్వీపం చాలా పాపులర్ అయింది. ఇదో ప్రైవేట్ ద్వీపం రెనైసన్స్ అరుబా రిసార్ట్ అండ్ క్యాసినో ఈ ద్వీపాన్ని నిర్వహిస్తోంది. ఇక్కడ రాజహంసలా కోసం టూరిస్ట్ లు వస్తారు ఇవి నిశ్శబ్దాన్ని ఇష్టపడే జీవులు గట్టిగా అరిచినా వాటిపై నీళ్లు చల్లి ఆటలాడేందుకు చూసిన భయపడి పోతాయి ఫ్లెమింగో లు. చక్కగా దగ్గర కూర్చొని చేతిలో గింజలు పెట్టుకొని చేయి చాపితే దగ్గరకు వస్తాయి. ఈ అందమైన పక్షులతో ఫోటోలు తీసుకోవడం చాలా గర్వకారణం గా భావిస్తారు పర్యాటకులు.