Categories
ఆఫీస్ కు కట్టు కొనే చీరెలు ఎప్పుడూ సింపుల్ గానే ఉండాలి. కలంకారి ఇకత్ నూలు ,ఖాదీ,టస్సర్,లినెన్ ఇవన్ని ఆరోగ్యంగా కనిపించే వస్త్రశ్రేణి .లేత,మధ్యస్థ, వర్ణాల్ని ఎంచుకొంటే అందంగా ట్రెండీగా హుందాగా కనిపించవచ్చు. సింపుల్ మేకప్ చాలు పెదవులకు లేత రంగు లిప్ గ్లాస్ వేసుకొన్న సరిపోతుంది. మెడలో నగలు లేకున్న పర్లేదు. చెవులకు పెద్ద స్టడ్స్ మంచి ఎత్నిక్ వెండి నగలు చేతికి స్టేట్ మెంట్ బ్యాంగిల్స్ ఆక్సిడైజ్డ్ సిల్వర్ జ్యువెలరీ అందంగా ఉంటాయి. రోజువారి అవసరాలకు సరిపోయోల బాగ్ ఎంపిక ఉంటే కంఫర్టబుల్ గా ఉంటుంది.అలాగే చెప్పుల్లో వెసైడ్ స్టిలెట్టోస్ ,పిప్ టో ,లెదర్ ప్లిప్ ఫ్లాఫ్ లు అందంగా బావుంటాయి. ఆఫీస్ లో ఎన్నో పనిగంటలు ఉండాలి కనుక ఆహార్యం ఏదైనా శరీరానికి సౌకర్యంగా ఉండాలి.