Categories
తవుడు ను పాల మీగడ తో కలిపి కళ్ళ చుట్టూ ఉండే నల్లని వలయాలపై రాస్తే నెమ్మదిగా అ నలుపు పోతుంది. ఈ రహస్యం కనిపెట్టింది జపాన్ మహిళలు. తవుడు అంటే బియ్యం పై పొర. అదే తవుడుగా పిలుస్తారు జపాన్ మహిళలు ముఖ సౌందర్యానికి ఈ పూతనే పూస్తారు. తవుడులో ఉండే ‘బి’ విటమిన్ చర్మానికి పుష్కలంగా ఉంది. వయసు పెరిగిన ఛాయలు కనపడకుండా పోతాయి. అలాగే జపాన్ లో దొరికే అజుకీ అనే గింజలతో ముఖానికి ఎన్నో పూతలు వేసుకుంటారు. ఈ ఎర్రని గింజల్లో ఎన్నో పోషకాలు దొరుకుతాయి. అలాగే వారానికి ఒకసారి హెర్బల్ నూనెల్లోని పరిమళం ఒత్తిడిని తగ్గించడంతో పాటు చక్కని పరిమళం కూడా ఇస్తుంది. జపాన్ మహిళల యవ్వన చర్మ సౌందర్య రహస్యం బియ్యం పిండితో వేసే రకరకాల పేస్ ప్యాక్స్ , గ్రీన్ టీ తాగటమే నట!