ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదంటారు. ఉల్లిపాయ వల్ల కలిగే ఉపయోగపడే లిస్టు లో ఇప్పుడు జుట్టు సంరక్షణ కూడా చేరింది. వాతావరణంలో కలిగే ఎన్నో మార్పులతో జుట్టు వుదిపోతూ వుంటుంది. ఖరీదైన వైద్యాలకి కూడా లొంగని పక్షంలో ఉల్లిపాయ వైద్యం వైపు చూడొచ్చు. ఉల్లిపాయ వాసన భరించడం కాస్త కష్టమే కానీ అందమైన జుట్టు కావాలంటే ఆ కష్టం భరించాలి. ఉల్లిపాయ ముక్కలు కోసి మెత్తగా గ్రయిడ్ చేసి ఉల్లి రసం తీసుకోవాలి. కుదుళ్ళ లోపల దాకా పట్టించి ఓ అరగంట పాటు ఆరనిచ్చి ఆ తర్వాత గోరు వెచ్చని నీళ్ళతో స్నానం చేస్తే ఫలితం తెలుస్తుంది. అలాగే ఉల్లిపాయ రసం లో తేనె కలిపి ఈ మిశ్రమం తలకు అప్లయ్ చేసి ఆరనిచ్చి ఈ ఉల్లిపాయ లోనే కొబ్బరి నూనె కలిపి తలకు మసాజ్ చేసే కొంతసేపయ్యాక తలస్నానం చేసిన ఫలితం బావుంటుంది. ఉల్లి రసంలో రమ్ కలిపి ఒక రాత్రంతా అలాగే ఉంచాలి. తెల్లవారాక ఈ రసం తలకి పట్టించి స్నానం చేస్తే చాలా మంచి ఫలితం వుంటుంది. ఏ రకంగా వాడినా వట్టి ఉల్లిరసం లో నైనా ఫలితం మాత్రం అద్భుతంగానే వుంటుంది.
Categories