Categories
పుదీనా ఆకు కదిలించినా అద్భుతమైన సువాసన వస్తుంది . ఈ ఆకును ప్రతి రోజూ వాడటం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి . ఈ ఆకూ నమలటం వల్ల లాలాజల గ్రంధులు ఉతేజితమై ,జీర్ణరసాలు ఊరతాయి . పుదీనా ఆకులూ పీచు ఎక్కువ . ఇది నోటి దుర్వాసన తగ్గిస్తుంది . పుదీనా లో ఉండే పాలిసిడిక్ యాసిడ్ కు ,బాక్టీరియాతో పోరాడే గుణం ఉంటుంది . దీన్ని ఆహారంలో భాగంగా చేసుకోవచ్చు . మెత్తగా నూరి ఫేస్ మాస్క్ కూడా వేసుకోవచ్చు . పుదీనా ఆకులూ వేసి కాచిన నీటి ఆవిరి పీల్చితే ఒత్తిడి,కుంగుబాటు తగ్గుముఖం పడతాయి . మనసు ప్రశాంతంగా ఉంటుంది .