Categories
మన జీవన విధానంలోనే గంటల కొద్దీ కుర్చీలకు అంటిపెట్టుకొని కూర్చునే అలవాటు ఉంది. గృహిణి ఉదయం చేసే పనేదో చేసి పిల్లలను, భర్తను సాగనంపి టి.వి కి అతుక్కుపోవటం ఆఫీస్ ఉద్యోగాల్లో గంటల తరబడి వర్క్ టేబుల్ ముందు పని చేయటం .కాస్త వయసు మీరితే ఇంకే పని లేక విశ్రాంతినని నమ్మి హాయిగా మంచానికి పరిమితం అవటం ఇవన్నీ నష్టమే . ఎవరైతే భౌతికంగా చురుకుగా ఉత్సహంగా ఉండక ,ఒకే చోటికి పరిమితం అయి ,దీర్ఘకాలం కూర్చోని ఉంటారు. వారి మెదడులో కొత్త విషయాలు గుర్తుపెట్టుకొనే మీడియన్ టెంపోరల్ లాబ్ తగ్గుతోందని కనిపెట్టారు.మెదడు భాగంలో రెండు శాతం మందం తగ్గుదల తెలుస్తోందట. ఆ భాగంలో మందం తగ్గటం అంటే జ్ఞాపక శక్తి పోతుందని చెపుతున్నారు. శరీరం చురుగ్గా ఉంటేనే మెదడు చురుగ్గా ఉంటుంది.