Categories
హిందువులు దేవాలయాల్లో పూజలు చేస్తే ,ముస్లిమ్ లు నమాజ్ చేస్తారు. క్రిస్టియన్స్ చర్చి లో ప్రార్థనలు చేస్తారు . ప్రతి మతానికి వారికీ సంబందించిన ప్రార్థనా మందిరాలు ఉంటాయి . కానీ రష్యాలో కజాన్ నగరంలో ఇడర్ ఖహాస్ అనే సంఘ సంస్కర్త టెంపుల్ ఆఫ్ అల్ రెలిజియన్స్ నిర్మించాడు . మతాలన్నింటిని ఒకే చోటకు తెచ్చేందుకు ప్రయత్నం చేశారు . 1992 లో ఈ భవన నిర్మాణం మొదలైంది . వివిధ మతాల ప్రార్థన మందిరాల గోపురాలు ఎలా ఉంటాయో అన్ని ఒకే భవనం పై దర్శనం ఇచ్చేట్లు నిర్మించాడు . ఈ భవనంలో ఏ మతానికి సంబంధించిన ప్రార్థనలు జరగవు . భిన్నత్వంలో ఏకత్వం చూపించేందుకు గాను చేసిన ఆలోచన మాత్రమే . పర్యాటకులను ఈ భవనం విశేషంగా ఆకర్షిస్తుంది .